ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

  • ఎస్ఐఆర్ సమయంలో అనుసరించాల్సిన తీరుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్
  • హాజరైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు
  • బెంగాల్ లో 93 లక్షల ఓట్లను తొలగించారన్న మహేశ్ గౌడ్
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మిగిలిపోయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ సమయంలో అనుసరించాల్సిన తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

గాంధీ భవన్ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగానికి సంబంధించిన సౌరభ్, అనూష, నిశాంత్ శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో బీఎల్ఏలకు శిక్షణ ఇస్తారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సంఘటన్ సృజన్ అభియాన్ ప్రక్రియను పకడ్బందీగా చేశామని వెల్లడించారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశామని చెప్పారు. పశ్చిమబెంగాల్ లో 93 లక్షల ఓట్లను తొలగించారని.. బీజేపీ చేసిన కుట్రలతో అక్కడ ప్రభుత్వమే మారిపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. 

Mahesh Kumar Goud
Telangana Congress
Voter List
Election Commission
Special Revision Process
Meenakshi Natarajan
Sachin Sawant
Booth Level Agents
BLA Training

More Telugu News